మానవత్వం చాటుకున్న వద్దన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు
మానవత్వం చాటుకున్న వద్దన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు
ఎమ్మెల్యే నాగరాజు


హనుమకొండ, 25 జూన్ (హి.స.) హనుమకొండ జిల్లాలోని

వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు కేఆర్ నాగరాజు మానవత్వం చాటుకున్నారు. గురువారం వారు వర్ధన్నపేట నుంచి మడికొండకు వస్తుండగా ఉర్సు మైదానం వద్ద రోడ్డు ప్రమాదం జరిగి క్షతగాత్రులు కనిపించారు. దీనితో ఎమ్మెల్యే నాగరాజు వెంటనే కారు దిగి క్షతగాత్రుడిని పరిశీలించి వెంటనే స్వయంగా అంబులెన్స్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. తీవ్ర రక్తస్రావం కావడంతో తన వాహనంలో ఉన్న ప్రథమ చికిత్స కిట్ తో తక్షణం సహాయపడ్డారు. అంబులెన్స్ రాగానే గాయాలైనా యువకుడిని అంబులెన్స్ ఎక్కించి త్వరతిగతిన హాస్పిటల్ కు తరలించారు. ప్రజా ప్రతినిధిగా ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న ఎమ్మెల్యే నాగరాజు గారికి ఈ సందర్భంగా క్షతగాత్రుల సంబంధికులు కృతజ్ఞతలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande