తిరుమలలో పట్టుబడిన భారీ కొండ చిలువ
తిరుమలలో పట్టుబడిన భారీ కొండ చిలువ
తిరుమలలో పట్టుబడిన భారీ కొండ చిలువ


తిరుమల, 04 జూన్ (హి.స.)

తిరుమలలో ఓ భారీ కొండ చిలువ పట్టుబడింది. సుమారు 12 అడుగుల పొడవైన కొండ చిలువ ధర్మగిరి వేదపాఠశాలలోకి చొరబడింది. ఉపాధ్యాయులుండే గదుల సమీపానికి పాము రావడాన్ని గుర్తించి వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర నాయుడుకి సమాచారమిచ్చారు.ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకుని దట్టమైన అడవిలో విడిచిపెట్టాడు. అధికారుల ముందు జాగ్రత్త వలన ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande