
అమరావతి, 04 జూన్ (హి.స.)
రుషికొండ వద్ద సముద్ర గర్భంలో సైకిల్ తొక్కారు. ఆంధ్రప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, లైవ్ ఇన్ అడ్వంచర్స్ స్కూబా డైవింగ్ అకాడమీ వ్యవస్థాపకుడు బి.బలరాంనాయుడు ఆధ్వర్యంలో ఈ సాహసోపేత కార్యక్రమం జరిగింది. బలరాంనాయుడు నాయకత్వంలో నలుగురు స్కూబా డైవర్ల బృందం సముద్ర ్ఠగర్భంలో సైక్లింగ్ చేశారు. గతంలో అనేక సైకిల్ క్లబ్లు చురుకుగా ఉండేవని, అయితే ప్రస్తుతం వాటి కార్యకలాపాలు కొంత తగ్గాయని బలరాంనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా క్లబ్లను బలోపేతం చేసి నేటి యువతను సైక్లింగ్ వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ