మాస్కో అడ్వాన్స్డ్ ట్రెస్పోర్ట్ డెవలప్మెంట్.సెంటర్ పని తీరు అద్భుతం...మంత్రి లోకేష్
మాస్కో అడ్వాన్స్డ్ ట్రెస్పోర్ట్ డెవలప్మెంట్.సెంటర్ పని తీరు అద్భుతం...మంత్రి లోకేష్
మాస్కో అడ్వాన్స్డ్ ట్రెస్పోర్ట్ డెవలప్మెంట్.సెంటర్ పని తీరు అద్భుతం...మంత్రి లోకేష్


అమరావతి, 04 జూన్ (హి.స.)

మాస్కో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టు డెవల్పమెంట్ సెంటర్ పనితీరు అద్భుతమని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ కొనియాడారు. రష్యా పర్యటనలో ఉన్న మం త్రి ఆ సెంటర్ను సందర్శించారు. భారత్లోనూ ఇలాంటి సెంటర్లు ఉండాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టు సెంటర్ ఒకటని అన్నారు. ఇది రవాణా నెట్వర్క్ నిర్వహణ, డిజిటలైజేషన్, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉందని వెల్లడించారు. ఇక్కడ మెట్రో, బస్సులు, ట్రాలీలు, ఎలక్ట్రిక్ రైళ్లు, బైక్ -షేరింగ్, స్కూటర్లు వంటి వాటిని అన్నింటిని ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థతో అనుసంధానించడం బాగుందని చెప్పారు. వీటిని ప్రయాణికులు ఒకే ప్లాట్ఫారం కింద ఉపయోగించుకోవచ్చన్నారు. పట్టణ శివారు ప్రాంతాలను పట్టణంలోని ప్రధాన కేంద్రాలతో అనుసంధానించే రైలు ప్రాజెక్టు మాస్కో సెంట్రల్ డయామీటర్స్(ఎంసీడీ) కూడా ఇందులో అంతర్భాగంగా ఉండటం విశేషమన్నారు.

ఇది నగరంలో మెట్రో రద్దీని తగ్గించడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. మాస్కో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, ట్రాన్స్పోర్టు సెక్యూరిటీ మేనేజ్మెంట్ సెంటర్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సీసీ కెమెరాల ద్వారా నగరంలోని ట్రాఫిక్, భద్రతను పర్యవేక్షించడంపై లోకేశ్ ఆసక్తి చూపారు. కాగా, మంత్రి లోకేశ్ బృందానికి స్వాగతం పలికిన వారిలో మాస్కో ట్రాన్స్పోర్టు కాంప్లెక్స్ సమాచార సాంకేతిక వ్యవస్థ, కమ్యూనికేషన్ డైరెక్టరేట్, అటానమస్ ట్రాన్స్పోర్టు రీసెర్చ్ అండ్ డెవల్పమెంట్ సెంటర్ విభాగాధిపతి పావెల్బోక్షా, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ హెడ్ ఓల్గా పిచికోవా, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టు అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవల్పమెంట్ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ అలెగ్జాండర్ సువోరోవ్, మాస్కో ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ జనరల్ సలహాదారు మస్తిస్లావ్ ఇపాకోచ్ ఉన్నారు. యాంపీ ధియేటర్లో మాస్కో అటానమస్ ట్రాన్స్పోర్టు సెంటర్ అభివృద్ధి గురించి పావెల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకేశ్ బృందానికి వివరించారు. ఈ సెంటర్ కార్యకలాపాలు, పనితీరు గురించి మస్తిస్లావ్ ఇపాకోచ్ వివరించారు. ఆ తర్వాత సమీపంలోని అధునాతన టికెటింగ్ సిస్టమ్స్ డెవల్పమెంట్ లేబోరేటరీని లోకేశ్ పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande