అభ్యుదయ కవి గురుజాడ అప్పారావు.స్వగృహానికి .త్వరలో కొత్త సొబగులు
అభ్యుదయ కవి గురుజాడ అప్పారావు.స్వగృహానికి .త్వరలో కొత్త సొబగులు
అభ్యుదయ కవి గురుజాడ అప్పారావు.స్వగృహానికి .త్వరలో కొత్త సొబగులు


విజయనగరం, 04 జూన్ (హి.స.)

,అభ్యుదయ కవి గురజాడ అప్పారావు స్వగృహం త్వరలో కొత్త సొబగులు దిద్దుకోనుంది. విజయనగరంలోని ఈ ఇంటిని ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. అందులో ఆడిటోరియం నిర్మించేందుకు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం తెలిపింది. మరోవైపు గురజాడ రచనల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా జరగనుంది. ఆయన గుర్తులు పదికాలాలు నిలిచి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. గురజాడ గృహం ఆధునికీకరణకు సంబంధించి నేడో, రేపో జీవో విడుదల కానున్నట్లు తెలిసింది. కాగా, గతేడాది ఆగస్టు 24న విశాఖలో జనసేన సభ నిర్వహించారు. ఆ సమయంలో గురజాడ స్వగృహం దుస్థితిని ఆ పార్టీ నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చలించిన పవన్.. ఆ మహనీయుడి నివాసగృహాన్ని ఆధునికీకరిస్తామని, ఆయన రచనలను డిజిటలైజేషన్ చేస్తామని ప్రకటించారు. ఆ హామీల అమలు దిశగా నేడు అడుగులు పడుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande