జగిత్యాల జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
జగిత్యాల జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
Acb


జగిత్యాల, 04 జూన్ (హి.స.)

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.80 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎస్ఆర్డీ) మొయినొద్దీన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే అధికారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కొడిమ్యాల ఫారెస్ట్ శాఖలో కలకలం రేగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande