ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకున్నాం : ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు
ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకున్నాం : ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు
Keshav Rao


హైదరాబాద్, 04 జూన్ (హి.స.)

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం కమిటీ వేసిందని... దాని కోసం ఆల్ పార్టీ మీటింగ్ (అఖిల పక్ష సమావేశం) పెట్టడం జరిగిందని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కే కేశవరావు మాట్లాడుతూ.. ఉద్యమకారులను గుర్తించడానికి ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.. వారు ఏం కోరుకుంటున్నారు.. అభిప్రాయాలు ఏంటి..? అనే దానిపై సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు.

విద్యార్థి సంఘాలను, అడ్వకేట్స్, డాక్టర్లు, ఉద్యమంతో సంబంధం ఉన్న వారిని కూడా పిలిచి మాట్లాడతామన్నారు. ఇందులో మొదటిది ఉద్యమకారులను గుర్తించడం. తొలి తరం ఉద్యమకారులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటాం.. ఉద్యమకారుల ఐడెంటిటీపై వర్క్ డివైడ్ చేస్తామని చెప్పారు. ఇది రెండవ మీటింగ్. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకున్నాం.. తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలు ఐక్యంగా అందరివీ తీసుకున్నాం.. కమిటీ నివేదికకు టైమ్ బాండ్ ఆలోచిస్తున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande