నేడు. రాష్ట్రంలోని.46 మండలాల్లో తీవ్ర వడగాలులు
నేడు. రాష్ట్రంలోని.46 మండలాల్లో తీవ్ర వడగాలులు
నేడు. రాష్ట్రంలోని.46 మండలాల్లో తీవ్ర వడగాలులు


అమరావతి, 04 జూన్ (హి.స.)

రాష్ట్రంలో ఎండ భగభగమంటోంది. గురువారం పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షంతో పాటు మరికొన్ని చోట్ల తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 79 మండలాల్లో వడగాలులు, శుక్రవారం 85 మండలాల్లో తీవ్ర, 67 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 43-45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. బుధవారం మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.5 డిగ్రీలు, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, నెల్లూరు జిల్లా గూడూరులో 44, కృష్ణా జిల్లా పెదపారుపూడి, పల్నాడు జిల్లా అమరావతిలో 43.4, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.3, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 43.2, గుంటూరు జిల్లా రాయపూడిలో 43, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 42.7, తిరుపతి జిల్లా బోనుపల్లెలో 42.4, విజయనగరం జిల్లా రాజాంలో 42.3, ఏలూరు జిల్లా కలపర్రులో 42 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇతర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఉండొచ్చన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande