జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్  కల్యాణ్

అమరావతి, 04 జూన్ (హి.స.)

జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్నియమించారు. జనసైనికుల నుంచే భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని అధినేత చెప్పుకొచ్చారు.

25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్నామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande