
హైదరాబాద్, 04 జూన్ (హి.స.)
నేటి సాయంత్రం మరియు రేపు
తెలంగాణ ( Telangana ) లోని పలు జిల్లాలో వర్షాలు ( Rains ) పడుతాయని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్( Adilabad), నిర్మల్(Nirmal), సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి - భువనగిరి, జనగాం, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి -కొత్తగూడెం జిల్లాల్లో చెదురుముదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
రేపు మధ్యాహ్నం తర్వాత ఇవి విస్తృతమైన తుఫానులుగా మారే అవకాశం ముందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మధ్యాహ్నం 2 గంటల తర్వాత రంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత దక్షిణ హైదరాబాద్లో ఉరుములతో కూడిన వర్షాలు ఏర్పడి, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..