
అమరావతి, 04 జూన్ (హి.స.)
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని తన గాత్రంతో ప్రపంచానికి చాటిచెప్పిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని కొనియాడారు. ప్రతి పాటలో కొత్త భావాన్ని పంచిన మహాగాయకుడు ఎస్పీబీ అని జగన్ అన్నారు.
జగన్ ట్వీట్..
‘సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని తన అమృత గాత్రంతో ప్రపంచానికి చాటిచెప్పిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వేలాది పాటలు ఆలపించినా.. ప్రతి పాటలో కొత్త భావాన్ని, కొత్త అనుభూతిని పంచిన మహాగాయకుడు ఆయన. తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా నివాళులు’ అంటూ జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ