
అమరావతి, జూన్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన
రష్యా పర్యటనలో భాగంగా ఈరోజుప్రసిద్ధ సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్
ఫోరమ్ (SPIEF'26) సదస్సులో పాల్గొన్న ఆయన, ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ దిగ్గజ
సంస్థలతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో భాగస్వామ్యం:
రష్యాలో అతిపెద్ద ఆర్థిక, సాంకేతిక సంస్థ
అయిన'Sberbank' సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్
యెఫిమోవ్తో లోకేశ్ సుదీర్ఘంగా చర్చించారు. క్వాంటం కంప్యూటింగ్, డిజిటల్ ఇన్నోవేషన్, మరియు వర్క్ఫోర్స్
డెవలప్మెంట్పై ప్రధానంగా దృష్టి సారించారు. రష్యా అభివృద్ధి చేసిన'GigaChat' అనే అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ను భారతదేశ బ్యాంకింగ్ మరియు పబ్లిక్
అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్లో అనుసంధానించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా కోరారు.
అలాగే, దేశీయ యూపీఐ (UPI) లావాదేవీల
భద్రతను పెంచేందుకు వీలుగా బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ సాంకేతికతను పంచుకోవాలని
ప్రతిపాదించారు.
రోబోటిక్స్ పరిశ్రమలకు ఆహ్వానం!
రష్యాలోని ప్రముఖ మైక్రో ఎలక్ట్రానిక్స్ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. రష్యాలోని సెమీకంటక్టర్ భాగాలు ఆర్ఎఫ్ఐడీ (RFID) చిప్స్, స్మార్ట్ కార్డ్ మాడ్యూల్స్ ఉత్పత్తిలో
అగ్రగామిగా ఉన్న ‘ఎలిమెంట్ గ్రూప్’ అంతర్జాతీయ ప్రాజెక్టుల అధిపతి ఆంటోన్ జఖారోవ్, అలాగే ‘నానోట్రోనికా’ సీఈఓ యూలియా సుహోరోస్లోవాతో తానే స్వయంగా
సమావేశమైనట్లు లోకేష్ వెల్లడించారు. రష్యా మైక్రోఎలక్ట్రానిక్స్ రంగంలో సింహభాగం వాటా కలిగి , విస్తృత డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్
నెట్వర్క్ ఉన్న ఎలిమెంట్ గ్రూప్ను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన
ఆహ్వానించారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అంతర్జాతీయ సాంకేతిక హబ్ లుగా మార్చేందుకు వ్యూహాత్మక ప్రతిపాదనలు లోకేశ్ చేశారు. వైజాగ్ నగరాన్ని అధునాతన ఆర్ఎఫ్ఐడీ స్మార్ట్ కార్డ్ చిప్ అసెంబ్లీ యూనిట్ల ఏర్పాటుకు అనువైన
ప్రాంతంగా ఆయన రష్యా ప్రతినిధులకు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ మార్కెట్కు అత్యంత కీలకమైన హై-టెక్ పవర్ సెమీకండక్టర్ల తయారీ
రంగాన్ని నెల్లూరులో నెలకొల్పాలని కోరారు.
పోర్టు ఆధారిత పరిశ్రమలు -
ఎలక్ట్రానిక్స్:
ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ విశాఖపట్నం
లేదా కాకినాడ పరిసర ప్రాంతాలలో పోర్టు ఆధారిత కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్లను
ఏర్పాటు చేయాలని'RusChem Group' ప్రతినిధులకు లోకేశ్
పిలుపునిచ్చారు. ఏపీలోని ఫార్మా రంగానికి అవసరమైన ముడి పదార్థాల (కెమికల్
కాంపోనెంట్స్) సరఫరాకు రష్యా సంస్థలు సానుకూలంగా స్పందించాయి. దీనితో పాటు, సెమీకండక్టర్ల తయారీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో
ఏపీని ముందంజలో నిలిపేందుకు వీలుగా'Element Group' యాజమాన్యంతో
ప్రత్యేక సమావేశం జరిపి, రాష్ట్ర ప్రభుత్వ ‘స్పీడ్ ఆఫ్
డూయింగ్ బిజినెస్’ విధానాలను వివరించారు.
జూన్7 వరకు పర్యటన - అంతర్జాతీయంగా ఏపీ బ్రాండింగ్:
జూన్2న మాస్కో చేరుకున్న మంత్రి లోకేశ్కు
అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు, ప్రవాసాంధ్రులు
ఘనస్వాగతం పలికారు. జూన్7వ తేదీ వరకు కొనసాగే ఈ6 రోజుల పర్యటనలో ఆయన మరికొంతమంది గ్లోబల్ ఇన్వెస్టర్లను కలవనున్నారు.
ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో భారత్-రష్యాల మధ్య నమ్మకమైన బంధం
ఎంతో అరుదైనది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీగా
ఉద్యోగాల సృష్టి, ఆర్థికాభివృద్ధిని సాధించడమే ధ్యేయంగా
ఈ పర్యటన సాగుతోంది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi