పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని అచ్చెన్నాయుడుకు విజ్ఞప్తి
పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని అచ్చెన్నాయుడుకు విజ్ఞప్తి
/mla-kakarla-suresh-meets-agri-minister-atchannaidu-155069


నెల్లూరు, 04 జూన్ (హి.స.)

ఉదయగిరి రైతుల సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడుగారి దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ శాఖ మంత్రికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజ్ఞప్తి చేశారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వ్యవసాయ మంత్రిని కోరారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

రైతు సంక్షేమమే లక్ష్యం అని చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు తో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక భేటీ అయ్యారు. గౌరవ రాష్ట్ర వ్యవసాశాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడుని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి, ఉదయగిరి నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న పలు కీలక వ్యవసాయ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా పొగాకు సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధరల సమస్యపై ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెరుగుతున్న సాగు ఖర్చులు, మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకొని మద్దతు అందించాలని మంత్రిని కోరారు. అలాగే పొగాకు రైతుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వారి ఆర్థిక స్థితి మెరుగుపడే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande