
కడప జిల్లా, 04 జూన్ (హి.స.
కడప జిల్లా బద్వేల్ రూరల్ పరిధిలోని శ్రీనివాసపురం వద్ద అదే గ్రామానికి చెందిన ఇండ్ల నాగార్జున అనే వ్యక్తి ఓ బావిలో చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడటంతో మృతి చెందాడు. మృతుడు చేపల కోసం వెళ్ళినప్పుడు తనతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారని ప్రమాదవశాత్తు తను బావిలో పడటంతో ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో వెంట ఉన్న ఇద్దరు పిల్లలు ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినప్పటికీ వారు భయపడి సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.
చివరికి మృతి చెందిన సమాచారం బద్వేల్ రూరల్ పోలీసులకు చేరటంతో మృతదేహాన్ని బావి నుండి వెలికి తీయడం జరిగింది. గతంలో ఇదే బావిలో ఓ తండ్రి ఇద్దరు పిల్లలను తోసెయ్యటంతో వారు మృతి చెందారు అప్పటిలో ఆ సంఘటన సంచలముగా మారింది. మరల ఈ ఘటనతో అదే బావి వార్తలలోకి రావడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV