
ఆళ్లగడ్డ, 04 జూన్ (హి.స.)
ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల సర్కిల్ నందు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ శ్రేణులతో కలిసి నిరసన పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం టీడీపీ మేనిఫెస్టో పత్రాలను మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి దగ్ధం చేశారు.
మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని గంగుల బ్రిజేంద్ర రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ పట్టణ, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV