
అమరావతి, 05 జూన్ (హి.స.)
మచిలీపట్నం, పర్యావరణ పరిరక్షణ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. మంగినపూడి బీచ్లో విద్యార్ధులతో కలిసి పరిశుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొని.. బీచ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ‘పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది’ అని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటి పరిరక్షించాలని కోరారు. పర్యావరణ సంరక్షణను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలన్నారు.
మానవాళి ఉనికి ప్రశ్నార్థకం కాకూడదంటే పర్యావరణ పరిరక్షణ అత్యవసరమని మంత్రి వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యల నుంచి బయటపడటం మన చేతుల్లోనే ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకోవడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సీడ్ బాల్స్ ద్వారా అడవుల విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ