జనసేన రాజ్యసభ అభ్యర్ధిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు చేసిన అధిష్టానం
జనసేన రాజ్యసభ అభ్యర్ధిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు చేసిన అధిష్టానం
జనసేన రాజ్యసభ అభ్యర్ధిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు చేసిన అధిష్టానం


అమరావతి, 05 జూన్ (హి.స.)

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. కొద్దిసేపటి క్రితం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో లింగమనేని పేరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.. 2015 నుంచి జనసేనతో, తనతో లింగమనేని ఉన్నారని పార్టీ నేతలకు ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి మూడు స్థానాలు, జనసేనకి ఒకటి కేటాయించారు. నిన్న (గురువారం) సాయంత్రం సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల నేతలు తీవ్ర కసరత్తు చేశారు. దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మూడు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకి కేటాయించినట్లు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ భేటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. సమావేశం అనంతరం జనసేన కూడా ఓ ప్రకటన జారీ చేసింది. ఎన్డీయే పొత్తులో భాగంగా జనసేనకి ఒక రాజ్యసభ సీటు కేటాయించారని పేర్కొంది. అభ్యర్థిని పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని, ఆ తర్వాత పార్టీ ప్రకటిస్తుందని వెల్లడించింది. జనసేన అభ్యర్థి పేరు దాదాపు ఖరారు కావడంతో టీడీపీ అభ్యర్థులు ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande