పోలవరం జిల్లా దేవీపట్నం మండలం లో పెద్దపులి.సంచారం
పోలవరం జిల్లా దేవీపట్నం మండలం లో పెద్దపులి.సంచారం
పోలవరం జిల్లా దేవీపట్నం మండలం లో పెద్దపులి.సంచారం


అమరావతి, 05 జూన్ (హి.స.)

దేవీపట్నం: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారం కొనసాగుతోంది. ప్రస్తుతం పరగసానిపాడు, కూడిపల్లి, బోడిగూడెంలో పులి సంచారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పెద్దపులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పులి మెడకు అమర్చిన రేడియో కాలర్, డ్రోన్ కెమెరాలతో పులి కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పులి సంచారం దృష్ట్యా దేవీపట్నంలోని గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డు మూసివేశారు. దీంతో పాపికొండలు వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరో వైపు పెద్ద పులిని బంధించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న రాత్రి 12 గంటల వరకు రెస్క్యూ బృందాలు కాపు కాసినా పులి చిక్కలేదు. అటవీ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పులిని బంధించేందుకు హనుమాన్ టీంలు, ప్రత్యేక నిపుణులు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులిని బంధించడం సాధ్యపడటం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande