ప్రభుత్వం నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం : హరీశ్ రావు
హైదరాబాద్, 05 జూన్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ డిప్యూటీ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విష
Harish Rao


హైదరాబాద్, 05 జూన్ (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ

జల హక్కులకు తీవ్ర ప్రమాదం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ డిప్యూటీ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో 07-04-2026 నాడు లేఖ రూపంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అందువల్లే నేడు పంపులు దెబ్బతిని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందారన్నారు.

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ కనిష్ఠ స్థాయికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ 74 శాతం వినియోగిస్తే, తెలంగాణ 25 శాతానికే పరిమితమైందని పేర్కొన్నారు. రైతులు, తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తు ప్రమాదంలో పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సోలార్ ఆధారిత విద్యుత్ విధానాలతో సాగునీటి రంగానికి ముప్పు ఉందని హెచ్చరించారు.

అందుకే రైతు డిస్కం ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని, కాళేశ్వరం, దేవాదుల నిర్వహణకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకుండా జల హక్కులు కాపాడాలి అంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాసిన లేఖలో హరీశ్ రావు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande