పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి : నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి : నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
Collector


నిర్మల్, 05 జూన్ (హి.స.)

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ

పాటుపడాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జిల్లాలోని మామడ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. చెట్లే ప్రతి జీవకోటికి ప్రాణాధారమని, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల, అటవీ అధికారి సుశాంత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎఫ్ఎఓ నాగిని భాను, డి.ఎస్.పి శ్రీనివాస్, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande