ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న అన్నదాతలు…
ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న అన్నదాతలు…
అన్నదాతలు…


బెళుగుప్ప, 05 జూన్ (హి.స.), ఈ యేడాది ఖరీఫ్ సీజనకు ముందే వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో వేసవి దుక్కులు, సేద్యాలు చేయడంలో నిమగ్నమయ్యారు. కాడెద్దులు, ట్రాక్టర్పై ఆధారపడి వ్యవసాయ పనులు చేస్తున్నా రు. ఖరీఫ్లో కంది, ఆముదం పంటలు సాగుచేసేందుకు మండలంలోని రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మండలంలో రైతులు కంది పంట సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు.

వర్షాలు కురిసి పలువురు రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కొరత కారణంగా వ్యవసాయ పనులు చేపట్టేందుకు అన్నదాతలు ట్రాక్టర్ల యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. డీజిల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. గత రెండు రోజుల నుండి డీజిల్ కొరత కారణంగా ట్రాక్టర్ల యజమానులు వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లకపోవడంతో రైతులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. డీజిల్ కొరత ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలువినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెట్రోల్ డీజిల్ కొరత తీర్చాలని పలువురు వాహనదారులు, మండల ప్రజలు రైతులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande