
అమరావతి, 05 జూన్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా
లోకేష్ రష్యాలో జరుపుతున్న పర్యటన ఇవాళ అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది ప్రతిష్టాత్మక 'సెయింట్ పీటర్స్ అంతర్జాతీయ
ఆర్థిక ఫోరమ్ (SPIEF 2026)' సదస్సులో పాల్గొంటున్న ఆయన, రష్యన్ పారిశ్రామిక దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లతో ఇవాళ
జరిపిన కీలక చర్చల వివరాలను తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా
పంచుకున్నారు
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో నిర్వహించిన
అంతర్జాతీయ ఆర్థిక ఫోరం (SPIEF) వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. కేవలం పెట్టుబడిదారులుగానే
కాకుండా, రాష్ట్ర అభివృద్ధిలో దీర్ఘకాలిక భాగస్వాములుగా పాలుపంచుకోవాలని రష్యా
పారిశ్రామికవేత్తలను, దిగ్గజ సంస్థలను ఆయన సాదరంగా ఆహ్వానించారు.
భారత్-రష్యాల మధ్య బంధం కేవలం వ్యాపార ఒప్పందాలకే
పరిమితం కాదని, అది ఒక దృఢమైన అనుబంధమని లోకేష్ పేర్కొన్నారు. భిలాయ్ స్టీల్ ప్లాంట్ నుంచి
గగన్యాన్ ప్రాజెక్టు వరకు అనేక కీలక సందర్భాల్లో రష్యా భారత్కు అండగా నిలిచిందని
ఆయన గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్దేశించుకున్న
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక
వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని ఆశాభావం
వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో
ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, 2047 నాటికి రాష్ట్ర జీడీపీని 2.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే
లక్ష్యమని వివరించారు. వెయ్యి కిలోమీటర్ల మేర విస్తరించిన సుదీర్ఘ తీరప్రాంతం, ఆరు ప్రధాన ఓడరేవులు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా వంటి
అంశాలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంతో అనువైనవని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని
ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
.
టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాలపై ప్రత్యేక
ఫోకస్
రష్యా మైక్రోఎలక్ట్రానిక్స్
రంగంలో అగ్రగామి సంస్థ అయిన'ఎలిమెంట్ గ్రూప్'ప్రతినిధులతో మంత్రి లోకేష్
ఇవాళ సమావేశమయ్యారు. ఈ భేటీలో విశాఖపట్నంలో అత్యాధునిక స్మార్ట్ కార్డ్ చిప్
అసెంబ్లీ లైన్, నెల్లూరు జిల్లాలో పవర్ సెమీకండక్టర్ల తయారీ విభాగం, మరియు శ్రీసిటీలో రోబోటిక్స్
సేవలను నెలకొల్పే అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వీటితో పాటు రష్యాకు చెందిన
ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ 'సిస్టెమా (Sistema)' లీడర్షిప్ బృందంతో సమావేశమై, ఏపీలో ఎలక్ట్రిక్ రివర్ మెట్రో
సిస్టమ్స్, ఏఐ ఆధారిత అర్బన్ గవర్నెన్స్ మరియు రాష్ట్రంలో
ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన 'క్వాంటం వ్యాలీ'ప్రాజెక్టులో భాగస్వాములు
కావాలని వారిని ఆహ్వానించారు.
అంతరిక్ష రంగం మరియు అంతర్జాతీయ
భాగస్వామ్యం
ఇవాళ జరిగిన రష్యా-ఇండియా
బిజినెస్ ఫోరమ్ వేదికగా మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ, 2030 నాటికి ఇరుదేశాల మధ్య లక్ష్యంగా
పెట్టుకున్న $100 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర
పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యంగా అంతరిక్ష రంగంలో ఏపీ
నిర్మించబోయే $4 బిలియన్ల 'తిరుపతి స్పేస్ సిటీ' ప్రాజెక్టులో భాగస్వాములు
కావాలని రష్యన్ స్పేస్ కంపెనీలకు పిలుపునిచ్చారు . అలాగే రస్కెమ్ గ్రూప్తో
చర్చలు జరుపుతూ వైజాగ్-కాకినాడ పరిధిలో పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ల
ఏర్పాటును ప్రతిపాదించారు.#InvestInAPహ్యాష్ట్యాగ్తో లోకేష్ పోస్ట్
చేసిన ఈ తాజా అప్డేట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి
---------------
==
.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi