ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : పద్మాదేవేందర్ రెడ్డి
ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : పద్మాదేవేందర్ రెడ్డి
Padma


మెదక్, 05 జూన్ (హి.స.)

రైతులు కష్టపడి పండించిన పంటలను

కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మెదక్ జిల్లా రామాయంపేట మండలం రైలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద పద్మా దేవేందర్ రెడ్డి నాయకత్వంలో శుక్రవారం పెద్ద ఎత్తున రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుజేసి పంటలు పండిస్తే ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షానికి నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande