శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్
తిరుచానూరు, 05 జూన్ (హి.స.) : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద కేంద్రమంత్రి కి రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జిల
పీయూష్


తిరుచానూరు, 05 జూన్ (హి.స.)

: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం దర్శించుకున్నారు.

ఆలయం వద్ద కేంద్రమంత్రి కి రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు, జేబీ శ్రీనివాస్, తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.

అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న కేంద్ర మంత్రి కి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande