
కాకినాడ , 07 జూన్ (హి.స.)
కాకినాడ జిల్లాలోని తుని దొండవాక పంచాయితీ, అగ్రహారం గ్రామంలో 3 ఏళ్ల చిన్నారి అదృశ్యమైంది. జాను అనే చిన్నారి ఆడుకుంటూ కనిపించకుండాపోయింది. పాప కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు గ్రామస్థులతో కలిసి రాత్రంతా గాలించారు. అయినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డ్రోన్ కెమెరాలతో కొండ ప్రాంతంలో జల్లెడపడుతున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొండ పరిసర గ్రామాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి మిస్సింగ్తో కుటుంబం విషాదంలోమునిగిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ