శ్రీశైలం. జలాశయం వద్ద.భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలం. జలాశయం వద్ద.భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలం. జలాశయం వద్ద.భారీగా ట్రాఫిక్ జామ్


నంద్యాల 07 జూన్ (హి.స.)

:శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు జలాశయం మలుపు వద్ద టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కకు దిగి మట్టిలో ఇరుక్కుపోయింది. బస్సును బయటకు తీసే క్రమంలో రోడ్డుకు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

జలాశయం నుంచి అటు దోమలపెంట ఫారెస్ట్ చెక్ పోస్ట్, ఇటు లింగాలగట్టు వరకు సుమారు 10 కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. బస్సును పక్కకు తీస్తే తప్ప వాహనాలు వెళ్లే వీలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బస్సును మార్గమధ్యం నుంచి తొలగించి ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి పర్యాటక బస్సు వెళ్తుండగా జలాశయం వద్ద ఈ ఘటన జరిగింది. అయితే, తెలంగాణ ప్రాంతంలో బస్సు ఇరుక్కుపోయినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande