
07 జూన్ (హి.స.)
తణుకు,
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రధాన ఆర్అండ్బీ రహదారి అయన కానూరు-లంకలకోడేరు రోడ్డు నిర్మాణానికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. రూ.3కోట్లతో నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తణుకు పైడిపర్రు చెర్వుగట్టు సమీపంలో మార్చి 30న ‘అక్షరం అండగా-పరిష్కారమే అజెండా’గా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కానూరు- లంకల కోడేరు రోడ్డు సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అతి త్వరలోనే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇందు లో భాగంగానే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.60కోట్లతో రోడ్లు పునర్నిర్మాణం చేశామన్నారు. మున్సిపల్ కమిషనర్ టి.రామ్కుమార్. డీఈఈ కె.ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ