టీడీపీ.రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు
టీడీపీ.రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు
టీడీపీ.రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు


అమరావతి, 07 జూన్ (హి.స.)

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. జనసేన నుంచి లింగమనేని రమేశ్ పేరును ఖరారు చేయడం, ఆయన నామినేషన్ దాఖలుచేయడం పూర్తయింది. టీడీపీ నుంచి సానా సతీశ్, భాష్యం రామకృష్ణ పేర్లను ఇప్పటికే ఖరారు చేసిన పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా మూడో అభ్యర్థిగా చింతకాయల విజయ్ పేరును ప్రకటించారు. దీంతో రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. విజయ్ పేరుతోపాటు సీనియర్ నేత వర్ల రామయ్య పేరును చివరివరకు పరిశీలించిన చంద్రాబాబు చివరకు విజయ్ వైపు మొగ్గారు.

సతీశ్, రామకృష్ణ ఇద్దరూ కోస్తా ప్రాంతానికి చెందినవారు కావడం.. వర్ల కూడా ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తరాంధ్రకు అవకాశమివ్వాలన్న ఉద్దేశంతోపాటు యువత, బీసీలకు ప్రాధాన్యమిచ్చే క్రమంలో విజయ్వైపు పార్టీ మొగ్గు చూపింది. సతీశ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నది ఏడాదిన్నర మాత్రమే కావడం, సామాజిక సమీకరణల్లో భాగంగా ఆయన పేరును ఖరారు చేసింది. జనసేన నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన రమేశ్కు టికెట్ ఇవ్వడం సతీశ్కు కలిసొచ్చింది. రామకృష్ణ పేరు ఖరారులో పార్టీకి విధేయత కీలకపాత్ర పోషించింది. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఆశించిన ఆయనకు చివరి నిమిషంలో అవకాశం దక్కలేదు. అయినప్పటికీ పార్టీకి నమ్మినబంటుగా పనిచేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పించారు. సోమవారం వారు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande