వారాంతం వాసవి సెలవులు ముగియడం తో శ్రీ వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
వారాంతం వాసవి సెలవులు ముగియడం తో శ్రీ వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
వారాంతం వాసవి సెలవులు ముగియడం తో శ్రీ వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

అమరావతి, 07 జూన్ (హి.స.)

వారాంతం కావడం, వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకే సుమారు 20 వేలమంది కాలినడకన తిరుమలకు వెళ్లడం భక్తుల తాకిడికి అద్దం పడుతోంది. అంతకుముందు లగేజీలు భద్రపరచుకోవడానికి అలిపిరి కూడలిలోని కేంద్రం వద్ద రెండు నుంచి మూడు గంటలపాటు భక్తులు నిరీక్షించారు. ఉదయం 10 గంటలకే 17,000 బ్యాగులను తిరుమలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. తక్కువ లగేజీ ఉన్నవారు వెంట తీసుకెళ్తూ కనిపించారు. రద్దీ కారణంగా అలిపిరి నుంచి రుయా వైపు ఉన్న రహదారిలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande