మా కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరు: రామచందర్రావు
మా కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరు: రామచందర్రావు
Bjp


హైదరాబాద్, 07 జూన్ (హి.స.)

కేంద్రమంత్రి కిషన్రెడ్డిని పొలిమేర

దాటనీయమని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారు.. భాజపా కార్యకర్తలు తలచుకుంటే మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు గ్రామాల్లో తిరగలేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

“భూములు తీసుకునే రైతులకు పరిహారం ఇవ్వాల్సిందే. రైతులు వ్యతిరేకిస్తున్నా.. కోహెడ పండ్ల మార్కెట్కు శంకుస్థాపన చేశారు. రైతులకు పరిహారం ఇచ్చాకే పండ్ల మార్కెట్ పెట్టాలి.

కాంగ్రెస్ నేతలు రైతుల భూములు కాజేస్తున్నారు.ధాన్యం కొనుగోలు చేయకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారు. కేంద్రం నుంచి రూ.13లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై సచివాలయం వద్ద చర్చకు సిద్ధంగా ఉన్నాం” అని రామచందర్రావు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande