
హైదరాబాద్, 07 జూన్ (హి.స.)
కర్ణాటకలో సీఎం మార్పు తర్వాత
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రభుత్వంలో కీలక మార్పులు ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ న్యూస్ చానల్తో మాట్లాడిన ఆయన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్నారు. నాకు మంత్రి పదవి అడగడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు నేనూ రేసులో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన వాళ్లు ప్రయత్నం చేయడం వాళ్ల పరిధిలోని అంశం అని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇవ్వడానికి కుల సమీకరణాలు అడ్డాస్తే నేను రాజీనామా చేసి త్యాగం చేయడానికైనా సిద్ధం అన్నారు. నిన్నటి సభ విజయవంతంతో బీఆర్ఎస్ నేతల నోళ్లు మూతపడ్డాయని సీఎం సభలో ప్లకార్డులు పట్టుకోవడం తప్పు కాదని, కార్యకర్తలు వాళ్ల అభిప్రాయం చెప్పారన్నారు. మహేశ్ గౌడ్ ఎందుకు మాట్లాడారో తెలియదని నాకు ఎవరూ వార్నింగ్ ఇవ్వలేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు