దేవాన్ష్ ఘాట్ పేరును తొలగించిన అధికారులు
దేవాన్ష్ ఘాట్ పేరును తొలగించిన అధికారులు
దేవాన్ష్ ఘాట్ పేరును తొలగించిన అధికారులు


సీతానగరం, 07 జూన్ (హి.స.)

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలోని పుష్కర ఘాట్కు మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ పేరు తొలగించారు. శనివారం ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. మునికూడలిలోని పుష్కర ఘాట్కు దేవాన్ష్ పేరు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన స్పందించారు. ఏ ఘాట్కు దేవాన్ష్ పేరు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ ఆధ్వర్యంలో ఈ ఘాట్ను అభివృద్ధి చేసి ‘దేవాన్ష్ ఘాట్’గా నామకరణం చేశారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఈరోజు దేవాన్ష్ ఘాట్ పేరుతో ఉన్న బోర్డును తొలగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande