ప్రధాన విమానాయన కేంద్రంగా అమరావతి
ప్రధాన విమానాయన కేంద్రంగా అమరావతి
ప్రధాన విమానాయన కేంద్రంగా అమరావతి


అమరావతి, 07 జూన్ (హి.స.)

రాష్ట్రంలో విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భారీ నజరానాలతో కూడిన ప్రోత్సాహకాలను అందజేసే విమానయాన పాలసీని రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ విధానంపై రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శనివారం ఉత్తర్వు జారీ చేశారు. విమానాశ్రయాల అభివృద్ధి, ఎయిర్లైన్స్, కనెక్టివిటీ, ఎయిర్కార్గో, మెయింటినెన్స్-రిపేర్-ఆపరేషన్ (ఎంఆర్వో), ఏరోస్పేస్, హెలికాప్టర్లు, సీప్లేన్లు, సాధారణ విమానయానం, వాటర్ డ్రోమ్స్, విమానయాన నైపుణ్యాభివృద్ధి, అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ, విమానయాన సుస్థిరత, పరిశోధన అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీని తీసుకొచ్చినట్లు అందులో వెల్లడించారు. రాష్ట్ర విమానాశ్రయాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం.. అమరావతిని ప్రధాన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడం, రాష్ట్రంలోని విమానాశ్రయాల నెట్వర్క్ను విస్తరించడమే పాలసీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande