స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. రీఓపెన్ ఎప్పుడంటే..?
స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. రీఓపెన్ ఎప్పుడంటే..?
Schools re open


హైదరాబాద్, 07 జూన్ (హి.స.)

తెలంగాణలో పాఠశాలల రీఓపెన్పై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా నిర్ణయించిన తేదీని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12న కాకుండా జూన్ 15వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి వేసవి సెలవుల తర్వాత జూన్ 12న పాఠశాలలను తిరిగి తెరవాలని విద్యాశాఖ భావించింది. అయితే ఆ తర్వాతి రోజుల్లో అంటే జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం వచ్చాయి. కేవలం ఒక్క రోజు అంటే జూన్ 12న స్కూళ్లు తెరిచి, ఆ వెంటనే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నుండి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. ఈ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం, విద్యార్థుల సౌకర్యార్థం రీఓపెనింగ్ తేదీని జూన్ 15 సోమవారంకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande