
అమరావతి, 07 జూన్ (హి.స.)
విశాఖ ఆర్కే బీచ్లో టైం మెషీన్ లాంటి ఆకృతి ఉండటం చూసి సందర్శకులు ఆశ్చర్యపోయారు. దిగ్గజ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తీసిన ‘సింగ్..గీతం’ అనే కొత్త సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఆ చిత్ర బృందం ఆదిత్య 369 సినిమాలోని టైమ్ మెషీన్ నమూనాను తీరంలో శనివారం ఇలా ఏర్పాటు చేసింది. అందులో సింగీతం శ్రీనివాసరావు తీసిన సినిమా పోస్టర్లను ప్రదర్శించారు. సందర్శకులు లోపలికి కెళ్లి ఆయా వివరాలను ఆసక్తిగా తిలకించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ