హైదరాబాద్ సనత్నగర్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. రూ.1.5 కోట్ల నగదుతో పరార్
హైదరాబాద్ సనత్నగర్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. రూ.1.5 కోట్ల నగదుతో పరార్
హైదరాబాద్ సనత్నగర్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. రూ.1.5 కోట్ల నగదుతో పరార్


హైదరాబాద్, 07 జూన్ (హి.స.)

నగరంలోని సనత్నగర్ పరిధిలోని జెడ్ కాలనీలో అత్యంత పకడ్బందీగా జరిగిన ఒక దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే లక్ష్యంగా చేసుకుని దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత సురేష్ రెడ్డి నివాసంలోకి చొరబడిన దుండగులు.. భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు.పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... దొంగలు సురేష్ రెడ్డి నివాసం నుంచి సుమారు రూ. 1.5 కోట్లను (కోటిన్నర నగదు) దోచుకెళ్లారు. ఈ భారీ దొంగతనంపై బాధితులు.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కాలనీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande