కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ పెరుగుతున్నాయి: కిషన్రెడ్డి
కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ పెరుగుతున్నాయి: కిషన్రెడ్డి
కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ పెరుగుతున్నాయి: కిషన్రెడ్డి


హైదరాబాద్, 07 జూన్ (హి.స.)

కార్పొరేట్ స్కూల్స్లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ కార్యాకలాపాలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలర్ట్గా ఉండి యువతను కాపాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో డ్రగ్స్ కల్చర్ భారీగా పెరిగిందని పేర్కొన్నారు. తాను బస్తీలో పర్యటించడానికి వెళ్తే మహిళలు డ్రగ్స్ గురించి తనకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఈరోజు (ఆదివారం) హైదరాబాద్ వేదికగా కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. యువత మత్తుకు బానిసలు, నిర్వీర్యం అవుతున్నారని అన్నారు. నీవురుగప్పిన నిప్పుల, చాప కింద నీరులా డ్రగ్స్ పెరిగిపోతున్నాయని.. దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. యువశక్తి నిర్వీర్యమైతే దేశానికి ప్రమాదకారమని అన్నారు. డ్రగ్స్ ద్వారా యువత తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. యోగా చేయడం ద్వారా డ్రగ్స్ నుంచి బయట పడేయొచ్చని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande