ట్రాఫిక్ పోలీసులకు ‘ పోలీసు కిట్స్’ పంపిణీ చేసిన ఎస్పీ
ట్రాఫిక్ పోలీసులకు ‘ పోలీసు కిట్స్’ పంపిణీ చేసిన ఎస్పీ
‘ పోలీసు కిట్స్’ పంపిణీ చేసిన ఎస్పీ


కర్నూలు, 07 జూన్ (హి.స.)

: వేసవి కాలంలో విధులు నిర్వహిస్తున్న కర్నూలు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం టోపీలు, స్టీల్ వాటర్ బాటిల్స్, ఎలక్ట్రాల్ బాక్స్లు, మాస్కులు, కళ్లద్దాలు తదితర వస్తువులతో కూడిన సమ్మర్ కిట్ బ్యాగులను కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఈ రోజు ఉదయం కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పంపిణీ చేశారు.

అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పునర్నిర్మాణం చేసిన గదులను ప్రారంభించారు. కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతి చెందిన హోంగార్డు కృష్ణ కుటుంబానికి పోలీసు సిబ్బంది తరఫున సేకరించిన రూ.50,800 ఆర్థిక సహాయాన్ని హోంగార్డు బాధిత కుటుంబానికి అందజేశారు.

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియాతో మాట్లాడుతూ....

ఎండాకాలంలో తీవ్ర ఎండలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం డిజిపి చీఫ్ ఆఫీస్ నుండి వచ్చిన రూ.1 లక్ష 90 వేల 5 వందల విలువైన సమ్మర్ కిట్ బ్యాగులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

కర్నూలు నగర ట్రాఫిక్ పోలీసులతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు ట్రాఫిక్ పోలీసు విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 127 మంది సిబ్బందికి టోపీలు, స్టీల్ వాటర్ బాటిల్స్, ఎలక్ట్రాల్ బాక్స్లు, మాస్కులు, కళ్లద్దాలు తదితర వస్తువులతో కూడిన సమ్మర్ కిట్ బ్యాగులను అందజేశామన్నారు.

తీవ్రమైన ఎండల్లోనూ ప్రజలకు సేవలందిస్తూ, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సేవలను కర్నూల్ ఎస్పీ గారు అభినందించారు.

కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్, కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ , స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్ రావు, కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్, సీసీఎస్ సీఐ రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande