
హైదరాబాద్, 07 జూన్ (హి.స.)
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద క్రీడాకారులు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. టీసీఏ ఏర్పాటు అయితేనే గ్రామీణ క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని నిరసనకారులు అంటున్నారు. టీసీఏని ఏర్పాటు చేయకపోతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు తలచుకుంటే టీసీఏ వస్తుందని, అందుకు నేతలంతా కృషి చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మాజీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA), పలువురు క్రికెటర్లపై ఆరోపణలు గుప్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi