
తిరుమల, 07 జూన్ (హి.స.)
తెలుగు రాష్ట్రాలో వేసవి సెలవులు చివరి దశకు చేరుకోవడం, వాతావరణం చల్లబడటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండపై ఎక్కడ చూసిన జనసందోహం గా మారిపోయింది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం తెల్లవారుజామునే భక్తుల రావడంతో రద్ధీ పెరిగింది. దీంతో తిరుమలలో టోకెన్లు లేని భక్తులతో సర్వదర్శనం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్లు దాటి వెలుపలికి భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, టోకెన్ లేని సామాన్య భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 20 గంటల సుదీర్ఘ సమయం పడుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు క్యూలైన్లలోనే పాలు, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV