భద్రాచలం లోని భద్రగిరి.మార్ట్ సూపర్.హిట్
భద్రాచలం లోని భద్రగిరి.మార్ట్ సూపర్.హిట్
భద్రాచలం లోని భద్రగిరి.మార్ట్ సూపర్.హిట్


భద్రాచలం, 08 జూన్ (హి.స.)

ఐటీడీఏ సహకారంతో ఏర్పాటై.. పూర్తిగా మహిళల పర్యవేక్షణలో భద్రగిరి మార్ట్ కొనసాగుతుంది. మార్చి 28న గవర్నర్ శివప్రతాప్ శుక్లా దీన్ని ప్రారంభించారు. నాణ్యత, మన్నికకు ప్రాధాన్యం ఇవ్వడంతో రోజు 500 మందికి తగ్గకుండా వినియోగదారులు సందర్శించి రూ.50 వేల వరకు సరకులు కొంటున్నారు. రెండు నెలల్లోనే రూ.30 లక్షలకు పైగా సరకుల విక్రయం జరిగింది. ఇంకో విశేషం ఏమిటంటే రూ.10 లక్షల వరకు ఐటీడీఏ పెట్టుబడి సాయం అందించగా దీన్ని ఇరవై రోజులు తిరక్కుండానే చెల్లించేశారు. మన్యంలోని గిరిజన మహిళలు ఎంతో శ్రమించి వివిధ ఉత్పత్తులు చేసినా మార్కెటింగ్ సదుపాయం లేక సరైన ఫలం పొందలేకపోవడాన్ని గ్రహించిన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ అందరి సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జీసీసీ ఉత్పత్తులైన తేనె, పసుపు, కారం, చింతపండు లభిస్తున్నాయి. గిరిజన మహిళా సమాఖ్యలు సబ్బులు, మిల్లెట్ బిస్కెట్లు, శానిటరీ ప్యాడ్స్, షాంపూలు, ఇప్ప లడ్డూలు, వివిధ రకాల పచ్చళ్లు, కర్రలు-వెదురుతో తయారైన కళాకృతులు, తాటాకు బుట్టలను తయారుచేసి అందుబాటులో ఉంచారు. రైతుల నుంచి నేరుగా సేకరించిన సేంద్రియ ఉత్పత్తులనూ విక్రయిస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande