నక్కపల్లి జిల్లాలో సంచలం సృష్టించిన ఉపమాక వెంకన్న ఆలయం హుండీ చోరీ కేసు కొలిక్కి
అమరావతి, 08 జూన్ (హి.స.) నక్కపల్లి, జిల్లాలో సంచలనం సృష్టించిన ఉపమాక వెంకన్న ఆలయం హుండీల చోరీ కేసు కొలిక్కి వచ్చింది. దేవుడి సొమ్మును కొల్లగొట్టిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు, సమగ్ర విచారణ తర్వాత పూర్తి వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించే
నక్కపల్లి జిల్లాలో సంచలం సృష్టించిన ఉపమాక వెంకన్న ఆలయం హుండీ చోరీ కేసు కొలిక్కి


అమరావతి, 08 జూన్ (హి.స.)

నక్కపల్లి, జిల్లాలో సంచలనం సృష్టించిన ఉపమాక వెంకన్న ఆలయం హుండీల చోరీ కేసు కొలిక్కి వచ్చింది. దేవుడి సొమ్మును కొల్లగొట్టిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు, సమగ్ర విచారణ తర్వాత పూర్తి వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఈనెల 3న అర్ధరాత్రి ఉపమాక ఆలయంలో చొరబడిన ఇద్దరు దొంగలు హుండీలను కట్టర్లతో కత్తిరించి అందులోని నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మరునాడు ఉదయం విచారణలో ఆభరణాల మూట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ ఆరు విచారణ బృందాలను ఏర్పాటు చేశారు. నక్కపల్లి సీఐ, ఎస్సైలతో కలిసి గడిచిన నాలుగు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం వద్దనే ఉంటూ పలు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితులపై విస్తృతంగా ప్రచారం చేశారు. గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సమాచారం ఇచ్చారు. నిందితుల చిత్రాలతో దర్యాప్తును ముమ్మరం చేసి, పురోగతి సాధించినట్లు తెలిసింది. నిందితులు నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానిక గ్రామస్థుల నుంచి మంచి సాకారం అందడంతో కేసు ఛేదన సులువైనట్లు సమాచారం. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని సొత్తును రికవరీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ మురళీతో ‘న్యూస్టుడే’ మాట్లాడగా నిందితులను గుర్తించామని, సోమవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande