కుప్పం ఇంచార్జి గా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తొలగింపు
కుప్పం ఇంచార్జి గా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తొలగింపు
కుప్పం ఇంచార్జి గా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తొలగింపు


అమరావతి/కుప్పం :, 08 జూన్ (హి.స.)

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను తప్పించారు. ఆయన స్థానంలో అనంతపురానికి చెందిన యువకుడు, పార్టీ తరఫున పీ4 పథకాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీకాంత్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఉండవల్లి నివాసంలో కుప్పం నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులతో సీఎం సమావేశమయ్యారు. కుప్పం టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్, కడా రాజకీయ సలహా మండలి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఏపీఎ్సఆర్టీసీ వైస్చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ బీఆర్ సురేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎమ్మెల్సీ శ్రీకాంత్ను కుప్పం బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు.

కంచర్ల స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి కుప్పం బాధ్యతలు అప్పగిస్తానని, ఆయన ఆదేశాల ప్రకారం పార్టీ శ్రేణులు నడచుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అధినేత ఆదేశాలను శిరసావహిస్తానని అన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు చెప్పి సమావేశం నుంచి నిష్క్రమించారు.

శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానిక నాయకులను కలుపుకొనిపోవడంలో విఫలమయ్యారు. ఆయన తీరుపై ఫిర్యాదులు ఎక్కువవుతుండడంతో ఆయన్ను పక్కనపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అనంతపురానికి చెందిన శ్రీకాంత్కు ఆ బాధ్యత కట్టబెట్టారు. సమావేశంలో పాల్గొన్న నేతలకు ఆయన్ను పరిచయం చేశారు. ఈయన అనంతపురం పాతూరు బోయవీధికి చెందిన నాగభూషణం, గంగమ్మ దంపతుల కుమారుడు. విజయవాడలోని ప్లానింగ్ కార్యాలయంలో ఇంజనీర్గా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జిగా ఏడాదిగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి రమ్మని కబురు పెట్టారనీ, ఏయే బాధ్యతలు అప్పగిస్తారనేది లిఖితపూర్వకంగా తెలియజేస్తారని శ్రీకాంత్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande