
అమరావతి, 08 జూన్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్రేపు(మంగళవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోద అధ్యక్షతన జూన్ 10వ తేదీన నిర్వహించనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వీరు పాల్గొననున్నారు.
మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరుకానుండగా, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
అదేవిధంగా, త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్ర, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా చర్చలు జరగవచ్చని సమాచారం. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక అంశాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహాయ నిధులు, పెండింగ్లో ఉన్న విభజన హామీలపై సీఎం చంద్రబాబు కేంద్ర నాయకత్వంతో చర్చించే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ