
విశాఖపట్నం, , 08 జూన్ (హి.స.)
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు (సోమవారం) భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1) పరిధిలోని సీసీడీ (CCD) విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడల్లో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుండగా, కొందరు మృతి చెందినట్లు సమాచారం. అయితే మరణాల సంఖ్యపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ యాజమాన్యం అత్యవసర భద్రతా చర్యలు చేపట్టింది. గాయపడిన కార్మికులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్లాంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ