
తిరుపతి: , 08 జూన్ (హి.స.)
, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల బ్యాగుల తనిఖీల కోసం అలిపిరి టోల్గేట్ వద్ద అధునాతన స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఆరింటిలో ప్రస్తుతానికి 4 అమర్చారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడం, ప్రస్తుతం ఉన్న స్కానర్లు పాతవి కావడంతో తనిఖీలకు సమయం పడుతోంది. దీంతో టోల్గేట్ వద్ద అప్పుడప్పుడు వాహనాలు బారులు దీరుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు 6 స్కానింగ్ కేంద్రాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన స్కానర్ల ఏర్పాటుకు తితిదే ఉపక్రమించింది. వీటితో సామగ్రిని అన్నివైపులా స్పష్టంగా స్కాన్ చేయొచ్చు. సంచిలో ఏ వస్తువులున్నాయో తెలుసుకోవచ్చు. ఒక్కో స్కానర్కు సుమారు రూ.45 లక్షలు వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ