బీఆర్ భగవాన్ దాస్ పోరాటంతోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ.. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
బీఆర్ భగవాన్ దాస్ పోరాటంతోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ.. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
MP Kavya


హనుమకొండ, 08 జూన్ (హి.స.)

బీఆర్ భగవాన్ దాస్ పోరాటంతోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమ రూపం సంతరించుకుని నేడు నిజం కాబోతున్నదని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. సోమవారం సీనియర్ కమ్యూనిస్టు యోధుడు, కార్మిక నాయకులు బీఆర్ భగవాన్ దాస్ 96వ జయంతి వేడుకలు హనుమకొండ జూనియర్ కాలేజీ జంక్షన్ లోని బీఆర్ భగవాన్ దాస్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు బీఆర్ భగవాన్ దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ భగవాన్ దాస్ పోరాటంతోనే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమై నేడు పూర్తి కాబోతున్నదని, తద్వారా ఈ ప్రాంతంలో వేలాది మంది యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు అందనున్నాయని అన్నారు. అలాగే వరంగల్ కు తాగు నీరు, సాగునీటి కోసం బీఆర్ భగవాన్ దాస్ పోరాడాలని, భూ పోరాటాలు నిర్వహించి పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు సాధించి పెట్టారని అన్నారు. తన జీవిత కాలం బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన భగవాన్ దాస్ రాష్ట్ర స్థాయిలో సిపిఐకి పేరు తీసుకు వచ్చారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ ఎప్పుడూ మిత్ర పక్షాలుగా కొనసాగుతూ రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి ముందుకు సాగుతున్నాయని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande