
హైదరాబాద్, 08 జూన్ (హి.స.)
నిమ్స్ నూతన డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న డాక్టర్ నగరి బీరప్ప ఉద్యోగ కాలం ఈ నెల 6న ముగియడంతో ఆయన స్థానంలో డాక్టర్ రాహుల్ దేవరాజ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వనపర్తికి చెందిన డాక్టర్ రాహుల్ దేవ్రాజ్ గాంధీ మెడికల్ కళాశాల నుంచి 1992లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1998లో ఎంఎస్ జనరల్ సర్జరీ, 2002 లో ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంసీహెచ్, యూరాలజీ పూర్తిచేశారు. ప దేండ్లుగా నిమ్స్లోని యూరాలజీ విభాగం ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. మొత్తం 21 ఏండ్ల టీచింగ్, క్లినికల్ అనుభవంతో కేవలం మూడేండ్ల కాలంలోనే 500 రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ను విజయవంతంగా జరిపి, దక్షిణ భారత దేశంలోనే నిమ్స్ యూరాలజీ విభాగాన్ని 3వ అత్యుత్తమ విభాగంగా నిలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi