
హైదరాబాద్, 08 జూన్ (హి.స.)
తీవ్రమైన ఎండలు, పొడి వాతావరణంతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు (Soutwest Monsoon) ప్రవేశించనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేశారు. ఈ నెల 10 నుంచి 12 మధ్య ఇవి తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఈశాన్య అరేబియా సముద్రం, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు తుఫాను ఆవర్తనాలు (Cyclonic Circulations) ఈ రుతుపవనాల కదలికకు సానుకూలంగా మారాయిఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ 1 నాటికే రావాల్సిన రుతుపవనాలు ఈసారి మూడు రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. ప్రస్తుతం ఇవి తీరప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల గుండా వేగంగా ముందుకు సాగుతున్నాయి. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం ఈ రుతుపవనాల రాక కోసం సిద్ధంగా ఉంది. రుతుపవనాల ద్రోణి వెంబడి ఏర్పడిన ఈ రెండు తుపాను ఆవర్తనాలవల్ల అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు ఈశాన్య దిశగా కదులుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi