సీఎం రేవంత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: మాజీ సీఎం విజయన్
సీఎం రేవంత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: మాజీ సీఎం విజయన్
Telangana CM Revanth Reddy


హైదరాబాద్, 08 జూన్ (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేరళ మాజీ సీఎం విజయన్(Pinarayi Vijayan) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో పేదల ఇండ్లను కూల్చేందుకు చేపట్టిన హైడ్రా ప్రాజెక్టును.. నాజీ నియంత అడాలఫ్ హిట్లర్ స్పూర్తితో చేపట్టినట్లు సీఎం రేవంత్ పేర్కొన్న విషయం తెలిసిందే. బెంగుళూరులోని ద హిందూ పత్రిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైడ్రా ప్రాజెక్టు పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. అయితే ఆక్రమణలను కూల్చివేందుకు చేపట్టిన హైడ్రా ప్రాజెక్టును.. నాజీ నియంత హిట్లర్తో పోల్చడాన్ని మాజీ సీఎం విజయన్ తప్పుపట్టారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలుకు షాకింగ్గా ఉన్నట్లు విజయన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను అవమానించినట్లే అవుతుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande